స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!

స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!

స్ట్రాబెర్రీలను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటి గుణాలు తెలుసుకుంటే మాత్రం ఎవరూ వీటిని నిర్లక్ష్యం చేయలేరు. రుచి, అందం రెండింటినీ కలిగిన ఈ పండ్లు మనకు కావలసిన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

విటమిన్ సీ సమృద్ధి:
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సీ బాగా ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలు తింటే రోజుకు అవసరమైన విటమిన్ సీ శాతం దాదాపు 98% లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టం తగ్గుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరిగి చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి.

కొలెస్ట్రాల్ నియంత్రణ:
ఎరుపు రంగు కారణం స్ట్రాబెర్రీల్లో ఉండే ఆంథోసయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్. ఇవి ఫ్లేవనాయిడ్స్‌లో భాగం. వీటితో పాటు ఎల్లాజిక్ యాసిడ్, క్వర్సెటిన్, పాలిఫినాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపులను నియంత్రిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి.

గుండెకు రక్షణ:
స్ట్రాబెర్రీల్లో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాల వల్ల రక్తనాళాలు వాపు చెందకుండా ఉంటాయి. ఇలా హృద్రోగాల ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం, తరచూ స్ట్రాబెర్రీలు తినేవారికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తేలింది. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలవు. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

జీర్ణక్రియకు తోడ్పాటు:
స్ట్రాబెర్రీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలు తింటే సుమారుగా 3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది మలకదలికలను సులభతరం చేస్తుంది. అందువల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ పండ్లు ప్రీ-బయోటిక్ ఆహారంలా పనిచేస్తాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయం చేస్తాయి.

మెదడు ఆరోగ్యానికి:
స్ట్రాబెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు మెదడు కణాలను రక్షిస్తాయి. ఫ్లేవనాయిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ వీటిని తింటే మెదడు చురుకుగా ఉంటూ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలకు బారి పడకుండా కాపాడగలవు.

Tags:

About The Author

Advertisement

Latest News

అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా? అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా?
లోక‌ల్ గైడ్ టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఇంగ్లండ్ చేతిలో ఓటమి: టీమ్‌ఇండియా బౌలింగ్ విఫలం, డకెట్‌ అద్భుత శతకం
థైరాయిడ్ స‌మ‌స్య ఉందా..?
ఈ ఆకులు మూడింటిని న‌మిలి తింటే ఎలాంటి రోగం ఉండ‌దు..!
ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్