చర్ల మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ అంకిత్‌కు పీ డీ ఎస్ యూ - పీవైఎల్  వినతి పత్రం 

Published On
చర్ల మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

 

 

చర్ల  : లోకల్ గైడ్ :
ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం సమర్పించారు. చర్ల మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ను కలిసి విద్యార్థుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పీవైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ.. చర్ల మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ విద్య కోసం భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్లలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు మంత్రులు, కలెక్టర్ల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక చొరవ తీసుకుని చర్ల మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు పై చదువులు కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంకిత్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొంది ముయ్యన్న, సంతపూర్ సురేష్, ప్రసాద్, శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి