- District News
- శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
ప్రవక్త పుట్టినరోజు. ప్రపంచానికే పర్వదినం
కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి
సయ్యద్ ఇక్బాల్ ప్రముఖ వ్యాపారవేత్త
నాలుగో వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ హుస్సేన్
Published On
By Ram Reddy
వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్, ఆగష్టు 26:
ఆలంపల్లి దర్గా నుండి శివ రెడ్డి పేట్ దర్గా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగగా, అనంతరం శివారెడ్డి పేట్ సయ్యద్ ఇక్బాల్ ప్రముఖ వ్యాపారవేత్త నాలుగో వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్...... ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు సయ్యద్ ఇక్బాల్ ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
మతాల మధ్య ఐక్యతే మాట్లాడుతూ...
మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని పిలుపునిచ్చారు.
తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, కరుణ, సహనం, సోదరభావం మార్గంలో సమాజం ముందుకు సాగాలని సయ్యద్ ఇక్బాల్ అన్నారు.
కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమని తెలిపారు.
తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వికారాబాద్ శివారెడ్డి పేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వేలాది గా ,ముస్లిం సోదరులు,నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 09:51:05
తాండూర్లో మిలాద్-ఉన్-నబీ పీస్ మీటింగ్లో ముస్లిం పెద్దల పిలుపు
