రేణుకా చౌదరి జన్మదిన వేడుకల్లో కారేపల్లి కాంగ్రెస్ శ్రేణుల సందడి

మాజీ సర్పంచ్ దారావత్ భద్రు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా స్వీట్లు పంపిణీ

Published On
రేణుకా చౌదరి జన్మదిన వేడుకల్లో కారేపల్లి కాంగ్రెస్ శ్రేణుల సందడి

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 13 : మాజీ  కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కారేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పోలంపల్లి మాజీ సర్పంచ్ దారావత్ భద్రు నాయక్, ఉసిరికాయలపల్లి మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కారేపల్లి సెంటర్‌లో స్వీట్లు పంపిణీ చేసి రేణుకా చౌదరికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రేణుకా చౌదరి రాజకీయ జీవితంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల హక్కుల కోసం పార్లమెంట్‌ వేదికగా తన గళాన్ని వినిపించిన సీనియర్ నాయకురాలని అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలోనూ, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా మహిళలు, పేదలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె నిరంతరం స్పందించడం అభినందనీయమన్నారు. రేణుకా చౌదరి మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా కారేపల్లి సెంటర్‌లో స్వీట్లు పంపిణీ చేయడంతో స్థానికంగా సందడి నెలకొంది. నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వీట్లు పంచుకుంటూ రేణుకా చౌదరి నాయకత్వాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లావణ్య, లక్ష్మణ్, గుగులోత్ వీరన్న, పులి శక్రు నాయక్, రమేష్, గుగులోత్ రాము, వినాయక్, యశ్వంత్, రాందాస్, బబ్లూ తదితరులు పాల్గొని రేణుకా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి