నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.

ముఖ్యఅతిథిగా హాజరైన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

Published On
నూతన

లోకల్ గైడ్ తాండూర్:
తాండూర్ మండల పరిధిలోని గౌతపూర్ గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శుభం కన్వెన్షన్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై కన్వెన్షన్ నిర్వాహకులు సత్యమూర్తి, రాధాకృష్ణ కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులతో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శుభం కన్వెన్షన్‌లో ప్రజలు వివిధ శుభకార్యాలు, వేడుకలు విజయవంతంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. తాండూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఫంక్షన్ హాళ్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా కన్వెన్షన్ నిర్వాహకులు సత్యమూర్తి, రాధాకృష్ణ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News