మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.

Published On
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.

లోకల్ గైడ్/బంట్వారం:

మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బంట్వారం మండలం తోర్మమిడి గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సోదర సోదరీమణులకు అన్నదానం చేసి మత సామరస్యం, సోదరభావాన్ని చాటుకున్నారు. ప్రవక్త మహమ్మద్‌ బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మతాలకు అతీతంగా పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని, పేదలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భోజనం స్వీకరించారు. మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి