మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.

అన్ని వర్గాలు ఒకే తాటిపైకి వచ్చి సోదరభావాన్ని చాటాలి.

తాండూర్‌లో మిలాద్‌-ఉన్‌-నబీ పీస్‌ మీటింగ్‌లో ముస్లిం పెద్దల పిలుపు
Published On
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.

లోకల్ గైడ్/తాండూర్:
సమాజంలో శాంతికి మించినదేమీ లేదని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. బుధవారం మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూర్ పట్టణంలోని ఆలియా మసీదులో నిర్వహించిన పీస్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు,పలువురు క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ.. మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ముందుకు సాగాలని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
అలాగే ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, అవసరమైన వారికి సహాయం చేసే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కులమత భేదాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ఉండటం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం మరింత బలపడుతుందని అన్నారు.
మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం ప్రజలందరిలో సోదరభావం, సేవాభావం, మానవతా విలువలను పెంపొందించాలని ఆకాంక్షించారు. పీస్‌ మీటింగ్‌లో ముస్లిం పెద్దలు, మత పెద్దలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి