ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...

Published On
ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈనెల 31న ప్రారంభించనున్నారు.ఈ కిచెన్‌కు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా జగిత్యాల,మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల్లోని విద్యార్థులకు నాణ్యమైన,పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.IMG-20260827-WA0043ఈ కిచెన్ ద్వారా 17మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42వేల 450మంది విద్యార్థులకు,13జూనియర్ కళాశాలలో చదువుతున్న 6వేల 654మంది విద్యార్థులకు ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.కిచెన్ పరిధిలోని17 మండలాల్లో జగిత్యాల జిల్లాలో వెల్గటూరు,ఎండపల్లి,మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల,బెల్లంపల్లి,జన్నారం,మందమర్రి,లక్సెట్టిపేట,దండేపల్లి,కాసిపేట,నెన్నెల్,హాజీపూర్,నస్పూర్,భీమారం,పెద్దపల్లి జిల్లాలో రామగుండం,పెద్దపల్లి,అంతర్గాం లలో ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు పరిశుభ్రమైన వాతావరణంలో,నాణ్యతా ప్రమాణాలను పాటిస్తు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు.విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా,ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా విద్యను అభ్యసించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి