- District News
- ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
శివసాగర పాఠశాలలో సంప్రదాయబద్ధంగా సంబరాలు
ఆటపాటలతో సందడిగా మారిన పాఠశాల ప్రాంగణం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని శివసాగర పాఠశాలలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు.విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఉపాద్యాయులు తెలిపారు. ఈ మేరకు,బతుకమ్మ వేడుకలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అగనూర్ కిరణ్ కుమార్, డైరెక్టర్ ఉదయ్ శంకర్ పటేల్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
