పూల పండుగతో పాఠశాలలో సందడి.

శ్రీవాణి విద్యా మందిర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
Published On
పూల పండుగతో పాఠశాలలో సందడి.

లోకల్ గైడ్ /తాండూర్:
పెద్దేముల్ మండల కేంద్రంలోని శ్రీవాణి విద్యా మందిర్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
బతుకమ్మ పాటలు, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ మేరకు,మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశా కరస్పాండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మంజుల, విగ్నేశ్వరి, లలన, మెరీల, జగదేవి, స్వాతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News