- District News
- Ranga Reddy
- ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
Published On
By Ram Reddy
అర్బి వీ ఆర్ ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ లో (టీజీపీఏ) ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు తెలంగాణ సంస్కృతి, భాష, ప్రజల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు అంకిత భావంతో సేవలందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు తోట శ్రీనివాసులు, తిరుపతి, సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఫణి, మహేష్, అబ్దుల్ నాహర్, ఫ్యాకల్టీ పోలీస్ అకాడమీ సిబ్బంది తదితరులు నివాళులర్పించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Oct 2026 14:55:06
మాజీ సర్పంచ్ సుందరి అనిల్ పై సంచలన ఆరోపణలు
