యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

స్థానిక యువత కోసం లోకల్ జాబ్స్ పాటు వర్క్ ఫ్రమ్ హోమ్

ఉద్యోగ అవకాశాలపై టాస్క్, డీట్, వివిధ సంస్థల ప్రతినిధులతో సమీక్ష
Published On
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

-----------------------------
పెద్దపల్లి, సెప్టెంబర్ 25:(లోకల్ గైడ్ )
-----------------------------
జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష**సూచించారు.

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్, ఇండస్ట్రీ, ఎంగేజ్‌మెంట్" అంశంపై వివిధ కంపెనీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రత్యేక సమీక్షా  నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,,, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఉపాధి ఉద్యోగాలు, అర్హతలు, శిక్షణ, జీతం శ్రేణి, ఆశించిన ఉద్యోగాల గురించి చర్చించారు.

విద్యార్థులకు డేటా అనలిస్ట్ ప్లేస్‌మెంట్, శిక్షణ నిరుద్యోగులకు అందించాలని, ఉద్యోగ అవకాశాలు, జీతం, భవిష్యత్ అవకాశాలు, విద్యార్థుల అప్‌స్కిల్లింగ్ అవసరాలపై శిక్షణ పెంపొందించేలా నిరుద్యోగులకు ప్రత్యేక చొరవ కలిగి ఉండేలా టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణను అందించాలని తెలిపారు.

పదవ తరగతి , ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం ఉపాధి కల్పించేలా బ్యాంకింగ్ బేసిక్ లెవెల్స్, హెల్త్ కేర్ అసిస్టెంట్, పేషెంట్ కేర్ జాబ్స్, ప్రొడక్ట్ డిజైన్, రిటైల్ మార్కెట్లో సేల్స్ వంటి రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

బాలికలు,మహిళల కోసం ప్రత్యేక గర్ల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్రమోషన్స్ కల్పించేలా 30 రోజుల స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆదేశించారు.

నియామక డ్రైవ్ నిర్వహించే సాధ్యసాధ్యాలపై చర్చించారు. అవగాహన కార్యక్రమం నిర్వహించి తగిన సంఖ్యలో యువత సిద్ధమయ్యాక డ్రైవ్ నిర్వహించాలని, సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

టాస్క్ ఇంటర్ ద్వారా ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించే అవకాశంపై చర్చించి, అవసరమైన బ్యాచ్, విద్యార్థుల ప్రొఫైల్, అర్హత, ఉపాధి అవకాశాలు,ఏర్పాటు ,ఆసక్తిగల స్టార్టప్‌ల  గురించి పలు సూచనలు చేశారు.

స్థానిక యువతకు వర్క్-ఫ్రమ్-హోమ్ ఉపాధి అవకాశాలు, సోలార్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశంపై ,ఐటీ,సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాలు, బేసిక్-టు-మోడరేట్ స్థాయి
 ఐటీ  ,ఉపాధి అవకాశాలపై సమీక్షించారు.

అనంతరం పెద్దపల్లి టాస్క్ సెంటర్లో శిక్షణ పొంది ఐసిఐసిఐ బ్యాంక్  లో సీనియర్ ఆఫీసర్ గ్రేడ్‌లో 'రిలేషన్‌షిప్ మేనేజర్' ఉద్యోగం సాధించిన ముస్త్యాల మణిశ్రీ ని జిల్లా కలెక్టర్ అభినందించారు. 

ఈ సమావేశంలో జిల్లా ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్, రీజినల్ టాస్క్ సెంటర్ (ఇంచార్జ్) కౌసల్య ,వివిధ కంపెనీల ప్రతినిధులు శ్యామ్, హరిహర్, వంశీ, అర్జున్ , సంబంధిత , అధికారులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------------

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.