విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం ప్రతి విద్యార్థి

బాధ్యత:జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య
Published On
విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

సిద్దిపేట, సెప్టెంబర్ 5(లోకల్ గైడ్):

విద్యార్థులు మంచి విద్యను అభ్యసించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సాన్‌పల్లి గ్రామంలోని తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSREIS) పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కె. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆమె ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తారని తెలిపారు.ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని కె. సౌజన్య అన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా విద్యార్థులు తమను తాము రక్షించుకోవడంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం. రవి కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ కే. విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.  జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
        శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):  జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు