- District News
- గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలి : 81వ బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం మండల పరిషత్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల విద్యాశాఖ, మండల పరిషత్ అధికారులు, పాఠశాల సిబ్బంది, 81వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, విద్యార్థులు కష్టపడి మంచి భవిష్యత్తును సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చర్ల మండల ఎంఈఓ, ఎంపీడీఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, 81వ బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ గణపతి నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకొని 81వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో 81వ బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్‌తో పాటు సంతోష్ సింగ్, ఇనున్ కుమార్, కమల్ కుమార్, రాజేష్, ఉపేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
