- District News
- _షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
_బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు..._
ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్
_ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ఘటనను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు..._
_అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తహసీల్దార్ కిఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ప్రభుత్వ సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు..._
_అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చిటమట రఘు హామీ ఇచ్చారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు..._
_ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, కూరపాటి వేణు, గండపెల్లి సత్యం, వార్డు నెంబర్ ముమ్మనేని రమేష్,గండపెల్లి మహాలక్ష్మి, గండపెల్లి రజిని, తదితరులు పాల్గొన్నారు...._
