ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 

Published On
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 

 


తుర్కపల్లి ,సెప్టెంబర్ 18(లోకల్ గైడ్)

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా శ్రీ రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని వద్ద ఉపసర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ సోమల వెంకటేష్ హాజరై అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు .సమాజంలో సేవా భావాన్ని పెంపొందించేందుకు యువత ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితుడు రమాకాంత్ శర్మ, బండారి శ్రీను, రొయ్యల మధు, పాముల బాలకృష్ణ గౌడ్, పాముల రాజు గౌడ్ ,బోయిని శశి కుమార్, ఆకుల బాలరాజు, బండ్ర సాయి కృష్ణ, బండ్ర ప్రశాంత్, ఎడపల్లి ప్రశాంత్, ఎడపల్లి రాజు, నాగపురి సాయిరాం , తదితరులు గ్రామ ప్రజలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.  జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
        శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):  జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు