జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 

కేటీఆర్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు: ప్రదీప్ రెడ్డి.

Published On
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 

 

 

శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ): 

జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఉన్న భూమి నా సొంతం
ఈ ఫార్మ్ హౌస్ భూమికి కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం మీడియాకు తెలిపారు 
కేటీఆర్, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం మాత్రమేనని తెలిపారు. నా సొంత ప్రాపర్టీ అయిన జన్వాడ ఫార్మ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజ్‌కు ఇచ్చాను అంతే తప్పా ఆయకు నా భూమికి ఏమి సంబంధం లేదన్నారు. 
ప్రస్తుతం ఈ ఫార్మ్ హౌస్‌ను పరిశీలించేందుకు రాజకీయ పార్టీల నేతలు వస్తారన్న ప్రచారం జరుగుతుండటం ఈ ఫామ్ హౌస్ విషయం చెప్పాల్సి వచ్చిందన్నారు. 
ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏమైనా అనుమానాలు ఉంటే, నాకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చునన్నారు. 
ఫార్మ్ హౌస్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవన్నారు. ఈ భూములకు లీగల్‌గా క్లియర్ టైటిల్ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు ఏవైనా వివరాలు లేదా పత్రాలు కోరితే చట్టపరమైన విధానంలో వాటిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 
అయితే రాజకీయ పార్టీల నేతలు వచ్చి వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదం చేయడం సరికాదన్నారు.

Tags:

About The Author

Latest News

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.  జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
        శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):  జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు