కామేపల్లి మండలంలో 6 గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ పోరుబాట!

కేసీఆర్–కేటీఆర్ పిలుపుతో కదిలిన శ్రేణులు.. బానోత్ హరిప్రియ పిలుపుతో కొత్తలింగాల క్రాస్ రోడ్ వద్ద ‘వంట వార్పు’ - ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరసన

Published On
కామేపల్లి మండలంలో 6 గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ పోరుబాట!

 

 

కామేపల్లి, సెప్టెంబర్ 4, లోకల్ గైడ్ న్యూస్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామేపల్లి మండలంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్),IMG-20260904-WA0139 తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పిలుపు మేరకు, ఇల్లందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పిలుపుతో కొత్తలింగాల క్రాస్‌రోడ్‌లో ‘పోరుబాట–వంట వార్పు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ కామేపల్లి మండల మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజులు దాటినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వంట వార్పుతో నిరసన

నిరసనలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వంట వార్పు నిర్వహించారు. మాజీ మండల అధ్యక్షులు అంతోటి అచ్చయ్యతో కలిసి నాయకులు కార్యకర్తలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాట్రాల రాంబాబు, ఉపాధ్యక్షులు మల్లెంపాటి శ్రీనివాస్, సామా మోహన్‌రెడ్డి, ఒడియాల కృష్ణారెడ్డి, తీర్దాల చిదంబర్‌రావు, పుచ్చకాయల బాబు, అజ్మీరా శంకర్, అజ్మీరా రాజు, నునావత్ సూర్య, రాయల వెంకన్న, కామేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కన్నమాల రాంబాబు, గండమాల రమేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గండమాల చందర్‌రావు (చందు) తదితరులు పాల్గొన్నారు.

అలాగే కామేపల్లి మండలంలోని బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు, అన్ని గ్రామాల శాఖ అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో హాజరై ‘పోరుబాట–వంట వార్పు’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్