- District News
- బిజెపి ఏజెంట్ ఈ సి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు...
బిజెపి ఏజెంట్ ఈ సి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
Published On
By Ram Reddy
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లో
కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఏజెంట్ లా వ్యవహరిస్తు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు
కురవి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ తో సిపిఐ శ్రేణులు నిరసన ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం లో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని బేకాతర చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో సి ఈ సి జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ, సర్ ప్రక్రియను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తూ, లక్షలాది ఓట్లు గల్లంతు అయ్యే విధంగా రకరకాల కొర్రీలతో ప్రతిపక్ష పార్టీలు ఆయా రాష్ట్రాలలో అధికారం కోల్పోవడానికి కారణమై బిజెపికి తొత్తులా వ్యవహరిస్తు, కోట్లాదిమంది ప్రజలను అభద్రతా భావానికి, తీవ్ర ఆందోళనకు గురిచేసే సర్ ప్రక్రియను వెంటనే ఆపేసి, జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుండి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ బుడమ వెంకన్న, సహాయ కార్యదర్శి బుర్ర సమ్మయ్య, కురవి టౌన్ కార్యదర్శి తురక రమేష్, దూదికట్ల సారయ్య,టి రమేష్ బాబు, కలగూర నాగరాజు, నిలుగొండ నాగేశ్వరావు, బొడ్డు ఉదయ్, సంగేo జన్ను, బొల్లం అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
29 Sep 2026 17:55:03
ములుగు జిల్లా( లోకల్ గైడ్ )
ములుగు: దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ నల్లెల కుమారస్వామి జయంతి సందర్భంగా
