రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ తనిఖీ...

Published On
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ తనిఖీ...

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్,సిఐ రమేష్ మొక్క అందజేసి స్వాగతంIMG-20260916-WA0137 పలికారు.అనంతరం పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి,ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచాలని,వాటికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.రిసెప్షన్ కేంద్రం సిబ్బందితో మాట్లాడి రికార్డులు పరిశీలించారు.పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని,సిబ్బంది బ్యారక్‌ను తనిఖీ చేసి పరిశుభ్రంగా ఉంచాలని,అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.స్టేషన్ రైటర్,సిసిటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా నమోదవుతున్న నేరాలు,పెండింగ్ కేసులు,దర్యాప్తు పురోగతి,రౌడీషీటర్లు,హిస్టరీషీటర్ల కదలికలు,విజిబుల్ పోలీసింగ్,పెట్రోలింగ్ తదితర అంశాలపై ఎస్‌ఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతు పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు,బాధితుడితో మర్యాదపూర్వకంగా,మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని,చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కీలకమైన ప్రాంతంలో ఉందని,హైవే,రైల్వే స్టేషన్‌తో పాటు కొత్త కాలనీలు అభివృద్ధి చెందుతున్నందున శాంతిభద్రతలు,రహదారి భద్రత,మహిళల భద్రత,మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ముఖ్యంగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా జరిగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా,సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి,ఆస్తి నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధిస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు.కొత్త కాలనీల్లో వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తు బ్లూకోట్స్ సిబ్బంది క్రమం తప్పకుండా పర్యటించి భద్రతా పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు పోలీస్ స్టేషన్ నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఐ,ఎస్‌ఐలకు సూచించారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి