- District News
- Nalgonda
- తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి:
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి:
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .


జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, తెలుగు ప్రవాసులతో అనుసంధానం అంశాలపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కాన్సులేట్ ప్రతినిధులు గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ , బండ ప్రకాష్ ను శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు.సమావేశంలో తెలంగాణలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలపై చర్చించారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు .విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు తమ మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని పేర్కొన్నారు.
జర్మనీతో పాటు యూరప్‌లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన కోరారు. ప్రవాస తెలంగాణ వాసులు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను తీసుకురావడంలో వారధిగా నిలవాలని సూచించారు.“ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు వారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకోవడం గర్వకారణమని, వారు జన్మభూమి అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహాచార్యులు , అసెంబ్లీ సెక్రెటరీ ఆర్ . తిరుపతి , లేజిస్లేచర్ ప్రతినిధి బృందం సభ్యులు, భారత కాన్సులేట్ అధికారులు, తెలుగు ప్రవాసులు తదితరులు పాల్గొన్నారు.
