- District News
- కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుగ్యాల సంతోష్ రావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుగ్యాల సంతోష్ రావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
ఎలిగేడు మండల సర్పంచుల ఆధ్వర్యంలో ఘన సన్మానం
Published On
By Ram Reddy
ఎలిగేడు మండలం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుగ్యాల సంతోష్ రావు జన్మదిన సందర్భంగా ఎలిగేడు మండల సర్పంచులు మరియు మార్కెట్ చైర్మన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచులు దుగ్యాల సంతోష్ రావుకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన మరింత చురుకుగా పాల్గొనాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల సింగిల్ విండో చైర్మన్ సామ రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పోట్టాల రమేష్ , సర్పంచులు ఎలిగేడు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏలేటి వెంకట్ రెడ్డి.కప్పల ప్రవీణ్, రామిడి శైలజ వెంకటరామిరెడ్డి, గోపు రజిత లక్ష్మారెడ్డి జమున వేణు మాధవరావు, పల్లెర్ల వెంకటేష్, మారం కొమురయ్య, మద్దెల రమాదేవి సంపత్ , సిద్ది తిరుపతి యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొని దుగ్యాల సంతోష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Sep 2026 21:13:06
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
