- District News
- Nalgonda
- మురుగునీరు నిలువ ఉండడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
మురుగునీరు నిలువ ఉండడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
మురుగునీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చేయాలి.


మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నెలకొన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడానికి ఉదయమే మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా గల్లి గల్లి తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు . మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు పట్టణంలోని ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డులో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉందా లేదా త్రాగునీరు ప్రతిరోజు వస్తుందా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే తమ వీరికి రావడంతో చాలామంది మహిళలు తమకున్న సమస్యలను విన్నవించారు.. ఆయన పరిశీలించిన దాంట్లో మురుగునీరు కిందికి సాఫీగా వెళ్లడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులను , గ్రామ సర్పంచిని ఆదేశించారు.మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలకు ఆవాసంగా మారి డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తారని అన్నారు.డ్రైనేజ్ కనెక్టవిటీ తో పాటు చెత్త సేకరణ చెత్త డంపింగ్ యార్డ్, చిట్యాల రోడ్ లో ఉన్న మహాప్రస్థానంలో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
భౌగోళిక స్థాయిలను అంచనా వేసి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అనంతరం బుల్లెట్ నడుపుకుంటూ పట్టణమంతా పర్యటించారు .ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో ఎంపీవో పంచాయతీ సెక్రెటరీ తో పాటు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
