రామకృష్ణాపురంలో ఘనంగా వినాయక ఉత్సవాలు

వినాయకుడిని దర్శించుకుని,అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు

Published On
రామకృష్ణాపురంలో ఘనంగా వినాయక ఉత్సవాలు

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో సందడిగా మారింది. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు సోమవారం సాయంత్రం వేళ వినాయక మండపాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా గుడిపూడి తిరుమల రావు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక విగ్రహ ప్రతిష్ఠ కొరకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసిన గుడిపూడి తిరుమల రావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం పిట్టల మధు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తిరుమల రావు పాల్గొన్నారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించి, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. వినాయక చవితి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గుడిపూడి తిరుమల రావు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రామకృష్ణాపురం గ్రామ ప్రజలతో పాటు సింగరేణి మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి–సమృద్ధులతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని కోరారు. యువత, ప్రజలు ఉత్సవాల్లో ఐకమత్యంతో పాల్గొని ఆధ్యాత్మికతతో పాటు సామాజిక స్ఫూర్తిని చాటాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే పండుగలు ప్రజల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని, సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వొరికొర్ల వీరభద్రం, షేక్ హాజిమియా, పొట్లకాయల మహేష్, సామినేని తిరుపతి రావు, పిట్టల మధు, అడప వెంకటేశ్వర్లు, సంతోష్, సురేష్, చిన్న వెంకన్న, సాయికుమార్, కళ్యాణ్, కార్తీక్, చింతకాయల రామకృష్ణ, వాసు రమేష్, దొడ్డ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News