వ్యాగన్ కార్మికుల ఐక్య పోరాటానికి పిలుపు

కార్మిక చట్టాలు అమలు చేయాలి.. వేతనాలు పెంచాలి :

టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామయ్య
Published On
వ్యాగన్ కార్మికుల ఐక్య పోరాటానికి పిలుపు

 

 

కారేపల్లి, సెప్టెంబర్ 29 (లోకల్ గైడ్ న్యూస్):

మాదారం పరిధిలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన రైల్వే వ్యాగన్ కాంట్రాక్ట్ కార్మికులు 12 మంది టీయూసీఐలో చేరారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయడంతో పాటు వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ప్రకటించిన సెలవులను మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా తొలగింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేసే వరకు ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ కారేపల్లి–కామేపల్లి ఏరియా కార్యదర్శి ధారావత్ సక్రు, నాయకులు వీరు, రమేష్, కృష్ణ, వెంకన్న, బావాసింగ్, సురేష్, నాగేశ్వరరావు, కిరణ్, రాజేష్, భద్రయ్య, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దివంగత నేత నల్లెల కుమారస్వామి సేవలు చిరస్మరణీయం దివంగత నేత నల్లెల కుమారస్వామి సేవలు చిరస్మరణీయం
          ములుగు జిల్లా( లోకల్ గైడ్ ) ములుగు: దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ నల్లెల కుమారస్వామి జయంతి సందర్భంగా
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి:  
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే  కూన వివేకానంద్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు
బిజెపి ఏజెంట్ ఈ సి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
మురుగునీరు నిలువ ఉండడం వల్లే  ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
వ్యాగన్ కార్మికుల ఐక్య పోరాటానికి పిలుపు
పట్టభద్రులారా.. ఓటరుగా నమోదు చేసుకోండి