- District News
- Khammam
- సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక: తోటకూరి రాంబాబు
సింగరేణి, నవంబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్):
మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూరి రాంబాబు మాట్లాడుతూ.. మండల ప్రజలు వివిధ పనుల నిమిత్తం, తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి రావచ్చని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పనిచేస్తుందని, మండల ప్రజలకు ఒక చిరునామాగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బానోత్ రామ్మూర్తి నాయక్, సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ), జిల్లా నాయకుడు గుగులోత్ భీముడు నాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, మాజీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు కడియాల సుధాకర్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు తాజుద్దీన్, మండల పార్టీ సమన్వయకర్త వాంకుడోత్ గాంధీ, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు నునావత్ సాయికిరణ్, మైనారిటీ సెల్ నాయకుడు షఫీ, భూక్యా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
