పేదరిక నిర్మూలనకు గామా ఫౌండేషన్ కృషి హర్షనీయం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి

Published On
పేదరిక నిర్మూలనకు గామా ఫౌండేషన్ కృషి హర్షనీయం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి

IMG-20261029-WA0066

లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :

గామా ఫౌండేషన్ వికారాబాద్ జిల్లాలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుందని గ్రామ ఫౌండేషన్ సేవలు హర్షినీయమని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశపులులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ దుర్గాప్రసాద్ తొమ్మిది అంశాలపై సమాజంలో పనిచేసేందుకు నిర్ణయించారని అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సామాజిక చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ విద్యాభద్రత, ఆరోగ్య భద్రత, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆర్థిక భద్రత, మైక్రో రుణాలు తదితర అంశాలపై కృషి చేయడం హర్షనీయమని పేర్కొన్నారు. గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సీఈవో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేసి మా సిబ్బంది ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు గ్రామ ఫౌండేషన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలను  నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రాజెక్టు అధికారిగా బోయాజును నియామించినట్లుగా తెలిపారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా వెంకటేష్ ఉపాధ్యక్షులుగా వెంకటయ్యను నియమించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి చేతుల మీదుగా 30 మందికి  ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News