- District News
- నవంబర్‌లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల టీజేఎంయూ మహాసభకు సన్నాహాలు
నవంబర్‌లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల టీజేఎంయూ మహాసభకు సన్నాహాలు
భద్రాచలం రామలక్ష్మణ్, రవి పినపాక నియోజకవర్గ అధ్యక్షులుగా ఎకగ్రీవ ఎంపిక
భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయూ), నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యూ జే ఐ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. భద్రాచలం మాజీ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి టీజేఎంయూ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సామల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి జీ. ఉదయ రాఘవేంద్ర, అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షులు నూనె హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సామల ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఐ. ప్రభాకర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీజేఎంయూ యూనియన్ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి మహాసభను అశ్వారావుపేట నియోజకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయ రాఘవేంద్ర, నియోజకవర్గ అధ్యక్షులు నూనె హనుమంతరావు, కమిటీ సభ్యులు, మండల స్థాయి అధ్యక్షులు, సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. నవంబర్ నెలలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలను కలిపి రెండో మహాసభ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులుగా గోగికార్ రామ్ లక్ష్మణ్‌ను, పినపాక నియోజకవర్గ అధ్యక్షులుగా కొరస రవిని, భద్రాచలం మండల అధ్యక్షులుగా శ్రీమన్నారాయణను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. ఉదయ రాఘవేంద్ర మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వారిపై నమోదవుతున్న కేసులను అరికట్టేందుకు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యూనియన్ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు అధికారులను గౌరవిస్తూ ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా ఉండాలని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వాస్తవాలను ప్రతిబింబించేలా వార్తలు రాస్తూ మంచి జర్నలిస్టులుగా గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు. జిల్లాలో యూనియన్ సభ్యులకు ఎలాంటి సమస్య ఎదురైనా అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్యపడకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. నవంబర్‌లో నిర్వహించనున్న రెండో మహాసభను విజయవంతం చేసేందుకు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల సభ్యులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీజేఎంయూ భద్రాచలం నియోజకవర్గ సభ్యులు ఎం. రాజేష్, టీ.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం, టీ. రమణ, మాజీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రామలింగేశ్వరరావు, కే. దిలీప్, సభ్యులు కేశవరాజు తదితరులు పాల్గొన్నారు.
