- District News
- Nalgonda
- టి ఐ సి సి ఐ తెలంగాణ రాష్ట్ర చాప్టర్,రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియామకం .
టి ఐ సి సి ఐ తెలంగాణ రాష్ట్ర చాప్టర్,రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియామకం .
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్ .
ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ తరఫున రాష్ట్ర కోఆర్డినేటర్‌గా శ్రీ ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా టి ఐ సి సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ధరావత్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ధరావత్ మాట్లాడుతూ, గిరిజన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మరియు యువతకు వ్యాపారాభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన, పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ మరియు వెండర్ డెవలప్‌మెంట్ అవకాశాలను అందించడంలో టి ఐ సి సి ఐ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులైన ఎన్. బాలు మహేంద్ర నాయక్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టి ఐ సి సి ఐ కార్యక్రమాల విస్తరణకు, గిరిజన పారిశ్రామికవేత్తలను సంఘటితం చేయడానికి, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలను అర్హులైన వారికి చేరవేయడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.గిరిజన పారిశ్రామికవేత్తల ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం మరియు పారిశ్రామిక సాధికారతే టి ఐ సి సి ఐ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
