రాజ్యాంగ విలువలను కాపాడాలి:డిసీసీ అధ్యక్షులు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి.

హల్ద్వానీ ఘటనపై పేట లో కాంగ్రెస్ సత్యాగ్రహం

Published On
రాజ్యాంగ విలువలను కాపాడాలి:డిసీసీ అధ్యక్షులు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి.

నారాయణపేట ఆగస్టు 17:

ఉత్తరఖాండ్ రాష్ట్రం లోని హల్ద్వానీ లో జరిగిన కులావివక్ష ఘటనకు నిరస నగా ఏఐసీసీ, టిపిసిసి కమిటీ పిలుపు మేరకు సోమవారం నారాయణ పేట జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మహాధర్నా నిర్వహించా రు.సీవీఆర్ భవన్ నుంచి కాంగ్రెస్ నాయకు లు,కార్యకర్తలు భారీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వ హించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించిన అనంతరం అక్కడే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీ య అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే  పాల్గొన్న సభ అనంత రం జరిగిన ఘటన అత్యం త బాధాకరమన్నారు.
ప్రజా సభ జరిగిన ప్రదేశాన్ని ‘శుద్ధీకరణ’ పేరుతో బిజెపి పార్టీ కి చెందిన కొందరు సానుభూతి పరులు గంగ జాలం తో శుభ్రం చేయడం కుల వివక్షకు సంబంధిం చిన ఆలోచనలకు తావిచ్చే చర్యగా కనిపిస్తోందన్నా రు.ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా ఒక వ్యక్తి కులం ఆధారంగా అతని గౌరవాన్ని కించపరి చే చర్యలు జరగడం బాధా కరమన్నారు.అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించి నప్పటికీ ఇలాంటి ఘటన లు బిజెపి పార్టీ ప్రోత్సహిం చడంసిగ్గుచేటన్నారు.మల్లికార్జున్ ఖర్గే గారికి జరిగిన అవమానం ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం కాదని,కుల వివక్షకు వ్యతి రేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ జరిగిన అవమాన మని అన్నారు.ఈ ఘటన కు బీజేపీకి చెందిన కొందరు సానుభూతిపరుల ప్రమే యం ఉందని దీనిపై బీజేపీ నాయకత్వం ఘటనను బహిరంగంగా ఖండిం చి,సమగ్ర విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.కుల వివక్షను ప్రోత్సహించే చర్యలకు ఎవరి మద్దతు ఉన్నా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.ఘటనకు బాధ్యు లు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సత్యాగ్రహ దీక్షను జిల్లా కేంద్రానికే పరిమితం చేయ కుండా ప్రతి మండలం,ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలి ఈ ఘటన ను ఖండించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
*ప్రతి ఒక్కరి ఓటు హక్కును  కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది.*
ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు అప్రమ త్తంగా ఉండాలని సూచిం చారు.అర్హులైన ఒక్క ఓట రు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా నిబంధనల ప్రకారం పరిశీలించాలని కోరారు.
బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీఎల్ఏలు ఒక్కరే అన్నీ చేయలేరని, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇందులో భాగస్వామి కావాలన్నా రు.ఈ కార్యక్రమంలో పేట,కోస్గి, మక్తల్ మార్కెట్ చైర్మన్ లు శివారెడ్డి, భీము లు,రాధ లక్ష్మరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. సలీం,జిల్లా అధికార ప్రతినిధి సంతోష్,క్రమశిక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల శివకుమార్,ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య,మండల, పట్టణ అధ్యక్షులు కోట్ల.రవీందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్,అనంద్, విజ్జప్ప గౌడ్,సూర్య ప్రకాష్ రెడ్డి,శివరాంరెడ్డి,బాలయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ లుబండి.వేణుగోపాల్,సుధాకర్,ఎండి.గౌస్,నరహరి,వైస్ చైర్మన్ కె. హన్మం తు,బోయ. శరణప్ప,పళ్ళ అనిల్,పిఏసిఎస్ చైర్మన్ ఈదప్ప,నిరంజన్ రెడ్డి కౌన్సిలర్లు రాజేష్ ఘాట్, కుర్వ మనోజ్,శంకర్,ఉగ్గు రాజు,ఆర్టివో బోర్డ్ డైరెక్టర్ పోషల్ రాజేష్,యూత్ జిల్లా అధ్యక్షులు కోట్ల.మధుసూదన్ రెడ్డి,యూత్ మండల అధ్యక్షులు మహేష్, సర్ఫరాజ్, వేణు గౌడ్,అఖిల్ రెడ్డి,యస్సి సెల్ మండల అధ్యక్షులు చంద్రయ్య,శ్రీను,చందర్, రాజేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.సత్యాగ్రహం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు 
____________________

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.