స్నేహితుల మధ్య ఘర్షణ.. యువకుడు మృతి

డెలివరీ విషయంలో గొడవ.. యువకుడు  తలకు బలమైన గాయంతో కుప్పకూలిన యువకుడు 

Published On

గండిపేట, ఆగస్టు 14 లోకల్ గైడ్: 
స్నేహితుల మధ్య ఉద్యోగ సంబంధిత వివాదం విషాదంగా మారింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.కోకాపేటకు చెందిన అబ్దుల్‌ సమీద్‌( 31)  అతడు తన స్నేహితుడితో కలిసి నార్సింగిలోని ఓ ప్రముఖ బ్లింకిట్‌ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. డెలివరీల విషయంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటపట్టింపులు ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి పనిచేసే ప్రదేశంలోనే ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కాసేపటికే వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడి సమీద్‌ తలకు తీవ్రమైన గాయం అయ్యి తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సమీద్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ? కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ?
        ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ
బిజెపి విద్వేశ వైఖరి దేశానికి ప్రమాదకరం.
మున్సిపాలిటీలో 1వ వార్డు అభివృద్ధి పనుల్లో 1వ ర్యాంక్
ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.
స్నేహితుల మధ్య ఘర్షణ.. యువకుడు మృతి
వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను