వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి 

మాజీ కార్పొరేటర్ బి. సాగర్ గౌడ్ 

Published On
వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి 

గండిపేట్, ఆగస్టు 14 (లోకల్ గైడ్):

వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ బి సాగర్ గౌడ్ కోరారు. శుక్రవారం రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాగర్ గౌడ్ మాట్లాడుతూ..... కిస్మత్పూర్  కాలనీలలో వీధి దీపాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రాత్రివేళలో రహదారులన్నీ చీకటి మయంగా మారుతున్నాయి, దీంతో ప్రజలు, పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇది ప్రజల భద్రతకు కూడా ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు. ఈ సమస్యపై జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ కు క్షుణ్ణంగా వివరించారు. అవసరమైన వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని వీధి దీపాలను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు కోరారు. దీర్ఘకాలిక సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించి కిస్మత్పూర్ ప్రజలకు సురక్షితమైన రహదారి సదుపాయం కల్పించాలని సాగర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ? కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ?
        ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ
బిజెపి విద్వేశ వైఖరి దేశానికి ప్రమాదకరం.
మున్సిపాలిటీలో 1వ వార్డు అభివృద్ధి పనుల్లో 1వ ర్యాంక్
ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.
స్నేహితుల మధ్య ఘర్షణ.. యువకుడు మృతి
వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను