వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత 

  పైప్‌లైన్ పగిలి నీరు చేరడంతోనే తాత్కాలిక మూసివేత

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు
Published On
వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత 

 

లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా 
 బ్యూరో ప్రతినిధి :

వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలోని మరుగుదొడ్లకు తాళాలు వేశారంటూ ఇటీవల కొన్ని పత్రికలలో ప్రచురితమైన వార్తలపై వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ (డిఎం) నమ్రత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్తలలో పేర్కొన్న అంశాలపై స్పష్టతనిచ్చారు.
బస్టాండ్‌లోని మరుగుదొడ్ల నీటి పైప్‌లైన్ హఠాత్తుగా పగిలిపోవడంతో నీరు పెద్దఎత్తున బయటికి వచ్చి చేరిందని, అందుకే పరిశుభ్రత దృష్ట్యా తాత్కాలికంగా మరుగుదొడ్లకు తాళం వేయాల్సి వచ్చిందని డిఎం నమ్రత తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, పగిలిపోయిన పైప్‌లైన్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేసేందుకు మరమ్మతు పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.
బస్టాండ్‌కు వచ్చిపోయే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే మరుగుదొడ్ల పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా డిఎం నమ్రత తెలిపారు.

Tags:

About The Author

Latest News

వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత  వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత 
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు
సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.
ధరల దోపిడీని అరికట్టాలి.. పేదలను ఆదుకోవాలి!
ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.