ధరల దోపిడీని అరికట్టాలి.. పేదలను ఆదుకోవాలి!

కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్‌.. ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి

Published On
ధరల దోపిడీని అరికట్టాలి.. పేదలను ఆదుకోవాలి!

 

 

కారేపల్లి, నవంబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్):

ఎల్‌నినో, కరువు ప్రభావం పేరుతో నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపడం సరికాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను తక్షణమే నియంత్రించి, ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి మనిషికి నెలకు 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరారు. సోమవారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ డిమాండ్లు చేశారు. కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. పెరిగిన ధరలను అరికట్టడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దుకాణంలో సరుకుల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతూ అధిక ధరలకు సరుకులు విక్రయించే మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు మంచి నూనె, కందిపప్పు, గోధుమలు, జొన్నలు, పంచదార, టీ పొడి, ఉప్పు, కారం, పసుపు తదితర 14 రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాలని కోరారు. నిత్యావసర ధరల పెరుగుదలతో పేద కుటుంబాల జీవనం భారంగా మారిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు.

కూలీలకు 200 రోజుల ఉపాధి కల్పించాలి.

కరువు ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు దొరకడం లేదని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజుల ఉపాధి హామీ పని కల్పించాలని, కొలతలతో సంబంధం లేకుండా రోజువారీ కూలీని రూ.800 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు కల్పించడం ద్వారా కరువు పరిస్థితుల్లో గ్రామీణ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. అలాగే రైతుల రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు అందించడం ద్వారా అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరువు నివారణ చర్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి పేదలు, వ్యవసాయ కూలీలు, రైతులను ఆదుకోవాలని కొండబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత  వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత 
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు
సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.
ధరల దోపిడీని అరికట్టాలి.. పేదలను ఆదుకోవాలి!
ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.