- District News
- Ranga Reddy
- ఓట్‌చోరీపై పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఓట్‌చోరీపై పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఆరాంఘర్ చౌరస్తాలో ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):
దేశంలో ఓట్ల తొలగింపు వ్యవహారం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఓట్ చోరీ పై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆరాంఘర్ చౌరస్తాలో ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఓట్ చోరీ పై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు పడమటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ చోరీ లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లను తొలగించారని.. ముఖ్యంగా పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మొత్తం 20 కోట్ల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. అలాంటి ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని పేదలు, సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
పారదర్శకత ఉండేలా చూడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అయన ఆరోపించారు . ఓట్‌చోరీ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
