_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు

_జాలిగం రాకేష్, చైర్మన్ కిరణ్మయికి విమానాశ్రయంలో ఘన  స్వాగతం

Published On
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు

 

IMG-20261028-WA0089

కుత్బుల్లాపూర్ అక్టోబర్ 28 (లోకల్ గైడ్ ప్రతినిధి)


ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జాలిగం రాకేష్, గ్రూప్ చైర్మన్ కిరణ్మయి దుబాయ్ వ్యాపార పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.ఖాళీ స్థలాలు, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ భవిష్యత్తులో మరిన్ని వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం, సంస్థ అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించడం లక్ష్యంగా ఈ దుబాయ్ పర్యటన చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ పర్యటన ద్వారా కొత్త అవకాశాలకు మార్గం సుగమం కావడంతో పాటు సంస్థ బృందానికి అంతర్జాతీయ వ్యాపార రంగంలో మరింత అనుభవం లభించిందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధిలో బృంద సభ్యుల కృషి, సమష్టి భాగస్వామ్యం కీలకమని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ, సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో ఇలాంటి వ్యాపార పర్యటనలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ సంస్థ పురోగతికి కృషి చేయాలని పేర్కొన్నారు.సమష్టి కృషితో విజయాలే లక్ష్యంగా..ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ బృందం ఐక్యత, పరస్పర సహకారంతో మరిన్ని విజయాలు సాధించాలని సభ్యులు ఆకాంక్షించారు. దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన జాలిగం రాకేష్, కిరణ్మయికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

About The Author

Latest News

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు
త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్. క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం..
గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.