- District News
- చర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Published On
By Ram Reddy
చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ, వారి త్యాగాలు, సేవలను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, చర్ల పీఏసీఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్తో పాటు జవ్వాది రవికుమార్, ఆవుల విజయభాస్కర్‌రెడ్డి, సుందరి సురేష్, మేడిచర్ల వీరకుమార్, చల్లకోటి వాసు, పెద్దిరాజు, తోట మల్ల వరప్రసాద్, పటేల్ వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి, బాల బాలు, పరిటాల సంతోష్, మునిగెల వెంకన్న, పూజారి రమణయ్య, జితేంద్ర నాయుడు, దోమల రవి, కణితి శ్రీనివాసరావు తదితర నాయకులు, రైతులు, చర్ల మ్యాజిక్ యూనియన్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
