సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్.

నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత.

Published On
సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్.

 

లోకల్ గైడ్ తెలంగాణ . మునుగోడు .ఆగస్టు 15.

 

80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా జాతీయ జెండాను  నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య రావడానికి ఆనాటి కాంగ్రెస్ మహనీయుల పోరాటాన్ని గుర్తుకు చేస్తూ నేడు మనం అభివృధి పథంలో ఉన్నామంటే ఆనాటి ప్రధాని నెహ్రూ దురదృష్టి  కారణమన్నారు. దేశం ఆర్థిక సామాజిక న్యాయ రంగాల ఫలితాలను పేదలకు అందజేసిన ఘనత కాంగ్రెస్కు దక్కిందన్నారు. దేశభక్తి త్యాగాలు కాంగ్రెస్కు సొంతమని నేడు బిజెపి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరమన్నారు. దేశ సంపాదనను అంబానీలకు ఆదానిలకు దోచిపెడుతున్న బిజెపి నకిలీ దేశభక్తులు అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీసెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, చర్ల పెళ్లి గౌతమ్,చింతమల్ల వెంకయ్య, ఎండి అజీజ్, ఎండి ఫిరోజ్ ఖాన్, పగిళ్ల శివ,శ్రీనివాస్,మట్టపల్లి నాగరాజ్,గుడిపాటి శివ, వవిల్ల దేవదాస్, సచిన్,
వినీత్,శరత్,మంజునాథ్,నవీన్,బాలు, తదితరులు పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం