భద్రాచలం మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు శ్రీ పొదెం వీరయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ

Published On
భద్రాచలం మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు శ్రీ పొదెం వీరయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ

 

భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం బస్టాండ్ సమీపంలో భద్రాద్రి టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు శ్రీ పొదెం వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భద్రాద్రి టాటా మ్యాజిక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అంకాళ జగన్, రామకృష్ణ, అశోక్, కరుణాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడబాల వెంకటేశ్వరరావు, తమ్మల్ల వెంకటేశ్వరరావు, కొలపూడి వరుణ్, కాపుల శ్రీను, కొండా సతీష్, ముత్యాల సాయి భార్గవ్, సెల్ శెట్టి జయమ్మ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పందాల సరిత, పద్మాప్రియతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.