జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రియాంక.

Published On
జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

నారాయణపేట ఆగస్టు 15:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనా న్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకో వాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభి వృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచే యాలని సూచించారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బందిబాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ, భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులకు కలెక్టర్ నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, డిప్యూటీ కలెక్టర్ ఫణి కుమార్, ఏవో అనిల్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి రషీద్, కలెక్టరేట్ కాంప్లెక్స్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

*క్యాంపు కార్యాలయం, జెడ్పీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ*

అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రియాంక తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్క రించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:9.జెండా ఆవిష్కరించిన కలెక్టర్
-------------------------------------

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.