- District News
- రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గ్రీన్ వుడ్ స్కూల్ విద్యార్థిని 'జాగృతి' ఎంపిక
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గ్రీన్ వుడ్ స్కూల్ విద్యార్థిని 'జాగృతి' ఎంపిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో మహదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని జీడి జాగృతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తన క్రీడా నైపుణ్యంతో రాణించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా క్రీడాకారిణి జాగృతిని పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ "జాగృతి క్రమశిక్షణ, నిరంతర శ్రమ మరియు క్రీడల పట్ల ఉన్న అంకితభావమే ఈ విజయాన్ని అందించాయి. రాజన్న సిరిసిల్లలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా తను అద్భుత ప్రతిభ చాటి మన పాఠశాలకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడమే మన గ్రీన్ వుడ్ కాన్సెప్ట్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని జాగృతికి అభినందనలు తెలపడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలలో విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు.
