హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 

బీఆర్ఎస్ కౌన్సిలర్ జ్యోతి సురేష్ పిలుపు

Published On
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 

 

 

లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో :

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్  వికారాబాద్ 14 వార్డు కౌన్సిలర్ మంచన్ పల్లి జ్యోతి సురేష్ పిలుపునిచ్చారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుగానే ఓటు నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, పట్టభద్రులు తమ ఓటును నిర్లక్ష్యం చేయకుండా నమోదు చేసుకుని, భవిష్యత్ ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని బలంగా వినిపించాలని కోరారు.
అర్హత కలిగిన పట్టభద్రులు తమకు సంబంధించిన విద్యా అర్హత పత్రాలను, ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకుని, ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారం ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.“పట్టభద్రుల ప్రతి ఓటూ విలువైనదే  మీ ఓటు హక్కును నమోదు చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి” అని ఈ సందర్భంగా మంచన్ పల్లి జ్యోతి సురేష్ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్