వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,

Published On
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,

 

లోకల్ గైడ్,వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :
 
జాతీయ ఎయిడ్స్ సెంట్రల్ సొసైటీ వారి సౌజన్యంతో తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అనుమతితో  దివ్య దిశా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  హెచ్ఐవి ఎయిడ్స్ పై లింగయ్య పల్లెసుద్ధుల కళాబృందంచే అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రాణాంతక వ్యాధుల పట్ల చైతన్యం తెచ్చేందుకు హెచ్ఐవి కళాజత బృందం ద్వారా  వికారాబాద్ బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఇందులో భాగంగా దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు, ఈ వ్యాధికి నివారణ ఒకటే మార్గం అన్న ఈ వైరస్‌కు శాశ్వత విరుగుడు లేదని తెలియజేశారు,పూర్తిగా నయం చేసే మందు ఇంకా అందుబాటులో లేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించకపోతే ఈ వైరస్ ఎవరికైనా సోకే ప్రమాదం ఉంది..ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత: మనలో చాలామందికి ఈ వ్యాధి లక్షణాలు లేదా వ్యాప్తి గురించి సరైన అవగాహన ఉండదు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా వైరస్ ఉన్నదో లేదో స్పష్టంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు,
ఆరోగ్యకరమైన మరియు సుదీర్ఘమైన జీవితం: ఒకవేళ వైరస్ సోకినట్లు తేలినా, భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందించే యాంటీ రెట్రోవైరల్ చికిత్స (ప్రతిరోధక ఔషధ నియమం) మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా సాధారణ వ్యక్తుల్లాగే ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించవచ్చు.
సురక్షితమైన మార్గాలు: ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి సురక్షిత లైంగిక ప్రవర్తన, పరీక్షించిన రక్తాన్ని మాత్రమే తీసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు సమగ్ర పరీక్షా సరఫరా కేంద్రాల్లో ఉచితంగా, పూర్తి గోప్యతతో పరీక్షలు మరియు మందులు లభిస్తాయి. కళాబృందం ద్వారా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో.... ప్రాజెక్టు మేనేజర్ రామేశ్వర్, ఐసిటిసి కౌన్సిలర్ రత్నాకర్,రవేందర్,ఔట్రీస్ వర్కర్లు లలిత,అనిత కవిత దీపిక రాజేశ్వరి కళాబృందం లీడర్ లింగయ్య, కే ఉప్పలయ్య, కె నగేష్, జ్యోతి, ఇటికాల నరసింహ,ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్