- District News
- Warangal
- తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
మాదన్నపేట, నాగుర్లపల్లి గ్రామస్తుల అడ్డగింపు - పంట పొలాలకు నీటి తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళన
నర్సంపేట అక్టోబర్ 06( లోకల్ గైడ్) :
చెరువులోని నీటిని పంట పొలాలకు తరలించేందుకు తూము తీసేందుకు వచ్చిన రైతులను మాదన్నపేట, నాగులపల్లి గ్రామస్తులు అడ్డుకోవడంతో చెరువు కట్టపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
*అసలు ఏం జరిగింది?*
మంగళవారం ఉదయం కొంతమంది రైతులు చెరువులోని నీటిని తమ పంట పొలాలకు తరలించేందుకు తూము తీసేందుకు చెరువు వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న మాదన్నపేట, నాగులపల్లి గ్రామస్తులు వెంటనే పెద్ద సంఖ్యలో చెరువు కట్టపైకి చేరుకున్నారు.
చెరువులో ప్రస్తుతం నాలుగు అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నీరే రెండు గ్రామాల ప్రజలకు తాగునీటికి ఆధారం. పంటలకు తరలిస్తే మేము తాగునీటికి ఇబ్బంది పడతాం" అని గ్రామస్తులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీటిని తరలించవద్దని కోరినా రైతులు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
*గ్రామస్తుల ఆందోళన:*
తాగునీటి సమస్య తలెత్తుతుందనే ఆందోళనతో మహిళలు, యువకులు సహా గ్రామస్తులు చెరువు కట్టపైనే బైఠాయించి నీటి తరలింపును అడ్డుకున్నారు. తమకు తాగునీరే ముఖ్యమని, పంటలకు నీటిని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై సమాచారం అందుకున్న అధికారులు స్పందించి, ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
