నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు

Published On
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు

 

నల్లబెల్లి, అక్టోబర్ 06 (లోకల్ గైడ్ ):

నర్సంపేట నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి సారించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండలంలో నూతన యూత్ కమిటీల నియామక ప్రక్రియ వేగవంతమైంది. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్ ఆధ్వర్యంలో సోమవారం మూడు కీలక గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు.
నారక్కపేట, బజ్జు తండా, గుండ్లపహాడ్ గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శుల నియామకం ఏకగ్రీవంగా జరిగింది.

*నూతనంగా ఎన్నికైన కార్యవర్గం వివరాలు:*

*1. నారక్కపేట:* అధ్యక్షులు MD హసీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్రె అనిల్, ప్రధాన కార్యదర్శి దండెం శ్రీనాథ్, ఉపాధ్యక్షులుగా కలీం రాకేష్, ఉప్పుల మహేష్, లాసాన్ని నితిన్, కోడూరి రాజశేఖర్.
*2. బజ్జు తండా:* అధ్యక్షులు పొరిక వినయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ రవీందర్, ప్రధాన కార్యదర్శి తేజావత్ రవీందర్, ఉపాధ్యక్షులు లకావత్ బాలాజీ, కార్యదర్శి జరుపుల స్వామి.
*3. గుండ్లపహాడ్:* అధ్యక్షులు కర్దూరి కార్తీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి రాహుల్, ప్రధాన కార్యదర్శి కళ్లపల్లి రాజేష్, ఉపాధ్యక్షులు అనంతగిరి కిషన్, అల్లే విజయ్, కార్యదర్శి MD సాల్మన్, గౌరవ అధ్యక్షులుగా మర్రి చరణ్.
*సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చాలి - పురుషోత్తం సురేష్*
అనంతరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్ మాట్లాడుతూ... నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి తీసుకెళ్లాలని
పిలుపునిచ్చారు.
రానున్ననల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకమని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయం కోసం ప్రతి యూత్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును నమోదు చేయించే బాధ్యత యూత్ కాంగ్రెస్ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, NSUI నర్సంపేట డివిజన్ అధ్యక్షులు బేతి భరత్, మండల అధ్యక్షులు మంద శివ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు వల్లూరి రమేష్, కెలోత్ రాజు, గోవిందు రంజిత్, సర్పంచ్ కర్దూరి లలిత శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ గద్దల సురేష్, BC సెల్ ఉపాధ్యక్షులు కుంచల రాజు, నాయకులు ఆవుల అనిల్, మసంపల్లి అఖిల్, గుండెబోయిన సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
    నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
హైదరాబాద్–రంగారెడ్డి మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం: 
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం,
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ దివాకర్.టి.ఎస్ ఆకస్మిక పరిశీలన
కారేపల్లి మండల కార్యాలయంలో పోషకాహార ప్రదర్శనలో కలెక్టర్ దివాకర టి.ఎస్