- District News
- Warangal
- ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని BRTU వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఆశా డే సందర్భంగా పలు PHCలను సందర్శించి ఆశాలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఆశాలను PRC పరిధిలోకి తీసుకువస్తే, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు PRC ప్రకటించలేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రెండు DAలు ప్రకటించిన ప్రభుత్వం, DAలు లేని ఆశాలు, స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎలా పెంచుతుందని ప్రశ్నించారు. జాబ్ చార్ట్‌లో లేని పనులు చేయిస్తూ, సబ్ సెంటర్ డ్యూటీల పేరుతో కొందరు మెడికల్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ANC టార్గెట్ల పేరుతో వేధింపులు ఆపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆశల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలవాల లలిత, ప్రధాన కార్యదర్శి సంధ్య, నాయకురాళ్లు సుజాత, రమ, రజిత, రమ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
