_పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష స్పందన

_విద్యుత్ రంగ ప్రగతిని ప్రతిబింబిస్తున్న ప్రదర్శనపై   టి ఎస్ ఈ ఆర్ సి ఛైర్మన్, సభ్యుల ప్రశంసలు

_ఆధునిక సాంకేతికత, స్మార్ట్ గ్రిడ్‌లు, డిజిటల్ సేవలు, విద్యుత్ భద్రతపై అవగాహనకు వేదికగా ఎగ్జిబిషన్
Published On
_పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష స్పందన

 





 

హైదరాబాద్ ఆగస్టు 24 (లోకల్ గైడ్ ప్రతినిధి)
తెలంగాణ విద్యుత్ రంగం సాధించిన ప్రగతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వినియోగదారులకు అందుతున్న సేవలను ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026కు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ విద్యుత్ రంగం గత 120 సంవత్సరాల ప్రస్థానం నుంచి నేటి ఆధునిక సాంకేతిక యుగం వరకు సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల (టెక్నికల్),  చెరుకూరి శ్రీనివాసరావు (ఫైనాన్స్) సోమవారం సందర్శించారు. టీఎస్ ఈఆర్సి , ఛైర్మన్, సభ్యులకు టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తరఫున సంస్థ డైరెక్టర్లు వి. శివాజీ, కృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్. నరసింహులుతో పాటు మెట్రో జోన్, రంగారెడ్డి జోన్, మేడ్చల్ జోన్‌కు చెందిన ముఖ్య అధికారులు, టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.అనంతరం వారు పవర్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆసక్తిగా, క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ రంగానికి సంబంధించిన చారిత్రక పరిణామాలు, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు.120 ఏళ్ల విద్యుత్ ప్రస్థానానికి అద్దంతెలంగాణలో విద్యుత్ రంగం గత 120 సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రదర్శనను రూపొందించారు. విద్యుత్ ఉత్పత్తి నుంచి వినియోగదారుడి ఇంటి వరకు విద్యుత్ చేరే ప్రక్రియ,ప్రసారవ్యవస్థలోవచ్చినమార్పులు, పంపిణీ నెట్‌వర్క్‌లో ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులను వివిధ స్టాళ్లలో ప్రదర్శించారు.ప్రత్యేకంగా స్మార్ట్ గ్రిడ్‌లు, డిజిటల్ సేవలు, ఆధునిక విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, వినియోగదారులకు అందిస్తున్న ఆన్‌లైన్ సేవలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రదర్శించడం సందర్శకులను ఆకట్టుకుంటోంది.పంపిణీ వ్యవస్థ బలోపేతంపై అధికారుల వివరణఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ కార్యక్రమాలపై అధికారులు టీఎస్ ఈఆర్సి ఛైర్మన్, సభ్యులకు వివరించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడం, వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడం కోసం అమలు చేస్తున్న పలు చర్యలను వివరించారు.
అలాగే విద్యుత్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా అధికారులు వివరించారు.విద్యార్థులు, యువతకు విజ్ఞాన వేదిక
పవర్ ఎగ్జిబిషన్‌ను కేవలం విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రదర్శనగా కాకుండా విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు విద్యుత్ రంగంపై సమగ్ర అవగాహన కల్పించే విజ్ఞాన వేదికగా తీర్చిదిద్దారు. విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ప్రసారం అవుతుంది? ఎలా పంపిణీ అవుతుంది? భవిష్యత్‌లో విద్యుత్ రంగంలో ఎలాంటి సాంకేతిక మార్పులు రానున్నాయి? వంటి అంశాలను తెలుసుకునే అవకాశం సందర్శకులకు కల్పించారు.విద్యుత్ భద్రతపై అవగాహన అవసరంవిద్యుత్ వినియోగంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ ప్రమాదాల నివారణ, సురక్షిత విద్యుత్ వినియోగ పద్ధతులపై అవగాహన కల్పించడానికీ ప్రదర్శనలో ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాలు, గృహ విద్యుత్ వినియోగం తదితర అంశాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను ప్రజలకు వివరించేలా స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీఎస్ ఈఆర్సి ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలకు పరిచయం చేసే విధంగా పవర్ ఎగ్జిబిషన్–2026ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.వద్యుత్రంగంలోచోటుచేసుకుంటున్న సాంకేతిక పురోగతి, ఆధునిక వ్యవస్థలు, వినియోగదారులకు అందుతున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడంలో ఇటువంటి ప్రదర్శనలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ప్రదర్శనను సందర్శించి విద్యుత్ రంగ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలపై అవగాహన పొందాలని వారు సూచించారు.తెలంగాణ విద్యుత్ రంగ చరిత్ర, వర్తమానం, భవిష్యత్ సాంకేతిక ప్రగతిని ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026 విద్యుత్ రంగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ తరాలకు సాంకేతిక విజ్ఞానాన్ని చేరువ చేసే వేదికగా నిలుస్తోంది.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.