ఇంటర్నేషనల్ ఐదు రికార్డులు సాధించిన 

ప్రసన్న ఆర్ట్స్ &కల్చర్ సొసైటీ తెలంగాణ వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్

డాక్టర్ చందోలు ప్రసన్న
Published On
ఇంటర్నేషనల్ ఐదు రికార్డులు సాధించిన 




నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .


 అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం, శ్రీముఖ్ కాంప్లెక్స్, హిమాయత్ నగర్, హైదరాబాద్ లో 
డా.చందోలు ప్రసన్న, కార్యదర్శి, ప్రసన్న ఆరోహి ఆర్ట్స్ & కల్చరల్ సొసైటీ, తెలంగాణ 
వ్యవస్థాపక ఛైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్
ఇంటర్నేషనల్ లియోనార్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (హై అచీవర్) ఇంటర్నేషనల్ మైల్‌స్టోన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (బెస్ట్ పెర్ఫార్మర్)
 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త 
ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అయిదు రికార్డులను ఇంటర్నేషనల్ లియోనార్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (హై అచీవర్), ఇంటర్నేషనల్  బుక్ ఆఫ్  మైల్‌స్టోన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (బెస్ట్ పెర్ఫార్మర్), 
ఇంటర్నేషనల్  బుక్ ప్లాటినం అఫ్ రికార్డ్స్,ఇంటర్నేషనల్ డైమండ్ బుక్ అఫ్ రికార్డ్స్,
ఇంటర్నేషనల్ విల్సన్ బుక్ అఫ్ రికార్డ్స్ ను 
విజయవంతంగా
 డా. చందోలు ప్రసన్న 
సాధించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్, ఎమ్.ఎల్.సి సిరికొండ మధుసూదనాచారి , పూర్వ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి  దీపారాధన తో ప్రారంభించారు.
351 పాటలు 34 గంటల కార్యక్రమం,34 మంది నేపథ్య గాయకుల ఐదు విభిన్న భాషలలో రికార్డును సృష్టించారు.
34 మంది సినీ గాయకులతో గాన విభావరి అలరించింది.
ముఖ్య అతిథులుగా కవి, రచయిత డా.రామకృష్ణ చంద్రమౌళి  మాట్లాడుతూ రికార్డులను  ఛాలెంజ్ గా తీసుకొని సాధించి నిరూపించిన 
 డా.ప్రసన్న ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ టూరిజం, భాషా సంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న గౌరవ అతిథులుగా సినీ నటుడు మా కార్యవర్గ సభ్యులు 
చింతకుంట మాణిక్ రావు  మాట్లాడుతూ తన శక్తిని కళను నిరూపించి నూతన కళాకారులను ప్రోత్సహిస్తున్న రికార్డుల విజేత డా.ప్రసన్న ని పొగిడినారు.
సినీ నటుడు రమాకాంత్, గుర్రపు విజయ్ కుమార్  మాట్లాడుతూ డా. ప్రసన్న  ప్రత్యేకతను చాటుకుని తనేటో నిరూపించుకొని రికార్డును తన సొంతం చేసుకున్నారని తెలిపారు.సినీ నటుడు, నిర్మాత శేషు  కుమారుడు  అమెరికా లో ఉన్న అజిత్ చౌదరి జన్మదిన వేడుకలు ,  సంస్థ సెక్రటరీ డా. చందోలు ప్రసన్న, డా. ఆలూరి విల్సన్  జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ నటిమనీషా,హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ సీనియర్ సూపరింటెండెంట్
పీ.వీ.పీ ఆంజనీకుమారి,డా. ఎన్. ఇందిర,హైకోర్ట్ అడ్వకేట్  శుభప్రద పుల్లా,  మ్యూజిక్ డైరెక్టర్ గంటా రమేష్  మాట్లాడుతూ సహసం, కృషి తో అద్భుతమైన రికార్డు సృష్టించిన డా. ప్రసన్న ని పొగిడినారు. సంఘ సేవకులు హేమంత్, సంఘ సేవకులు,గాయకులు రమణయ్య  మాట్లాడుతూ ఉక్కు మహిళ  డా. ప్రసన్న 
నిరూపించరని తెలిపారు.
ప్రసన్న ఆరోహి సంస్థ ఉపాధ్యక్షులు  చందోలు ప్రేమ్ చంద్, సంఘ సేవకురాలు, మెడిటేషన్ టీచర్ కుంచపు రమ
మాట్లాడుతూ 34 గంటల సినీ విభావరి లో గీతాలాపన లో విజయం సొంతం చేసుకున్న డా.ప్రసన్న గారిని ఆశీర్వదించారు.రికార్డు కైవసం చేసుకున్న గాయని డా.చందోలు ప్రసన్న  మాట్లాడుతూ సహకరించిన  ప్రోగ్రామ్ కన్వీనర్ డా. ఆలూరి విల్సన్ ని అభినందనలు తెలుపుతూ గాయనీ గాయకులకు,మిత్రులకు, అతిథులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో పాటిబండ్ల మహేష్,  గాయకులు విప్లవ దత్,రణధీర్, నాగేశ్వర్రావు, చందోలు మేఘన,యాభై మంది గాయనీ గాయకులు 
 పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం