తాండూర్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు.

పరిష్కారంలో చూపటంలో టౌన్ అధ్యక్షుడు విఫలమవుతున్నారా? - జయంతి అనంతరం ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. 

- సమన్వయ లోపంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి.
Published On
తాండూర్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు.




లోకల్ గైడ్/ తాండూర్ 
తాండూర్ పట్టణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగాల్సిన సమయంలోనే నాయకుల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం అనంతరం రాజీవ్ కాలనీలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.


నాయకుల మధ్య విభేదాలు.. పెరుగుతున్న అసంతృప్తి.
రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం పూర్తయిన అనంతరం నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మాటామాటా పెరగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ వివాదానికి అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా, తాండూర్ టౌన్ అధ్యక్షుడిగా బాతుల నాగు బాధ్యతలు చేపట్టిన తర్వాత పట్టణ కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో పలు సమస్యలు, అంతర్గత విభేదాలు తలెత్తుతున్నప్పటికీ వాటిని పరిష్కరించి నాయకులు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో టౌన్ అధ్యక్షుడి పనితీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

సమస్యలకు పరిష్కారం చూపడంలో నాయకత్వ వైఫల్యమా?
పార్టీలో అంతర్గతంగా తలెత్తే చిన్నచిన్న సమస్యలను సకాలంలో పరిష్కరించి, అవి పెద్ద వివాదాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత పట్టణ అధ్యక్షుడిపై ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే సమస్యలు పరిష్కారం కాకుండా తరచూ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం టౌన్ అధ్యక్షుడి నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య విభేదాలు, పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,