ప్రపంచ ఫోటోగ్రఫీ  దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు సన్మానం.

భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్

Published On
ప్రపంచ ఫోటోగ్రఫీ  దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు సన్మానం.

 

 

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి
(లోకల్ గైడ్ న్యూస్):

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రతిబింబించే చిత్రాలను సంగ్రహించే సృష్టికర్తలు ఫోటోగ్రాఫర్లని అన్నారు. వందల భావాలను ఒక చిత్రంలో పలికించవచ్చునని, ఆ శిల్పులు ఫోటోగ్రాఫర్ లేనని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు.వరంగల్ రామన్నపేట లోని డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించి న సందర్భంగా గత 20ఏళ్లుగా ఫోటోగ్రఫీ మీదనే జీవన ఉపాధి గడుపుతూఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్ మల్లిపెద్ది రాము,హిందూ జాతీయ పత్రిక ఫోటోగ్రాఫర్ మురళి, ప్రభుత్వ జిల్లా పౌర సంబంధాల శాఖ ఫోటోగ్రాఫర్ తాళ్లపల్లి అశోక్ లు వేల ఫోటోలు వివిధ ఆకృతులలో తీసి ప్రజలకు అందజేయడంలో దిట్టలు. ట్రస్ట్ చే వీరిని శాలువాతో, బొకేతో ,ఘనంగా సన్మానించడం జరిగినది. భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఫోటో అనేది సంతోషాన్ని, మనసులోని ఉత్తేజాన్ని తెలియజేస్తూ భావితరాల వారికి అందించడం జరుగుతుంది అన్నారు. అసలు శాశ్వత ఫోటోను కనుగొన్న మహనీయుడు 1826 లో జోసెఫ్ నీ పో సోర్స్ అనే వ్యక్తి మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. వీరి ద్వారానే ఫోటోగ్రాఫర్ అనేది శాశ్వతంగా ప్రపంచం మొత్తం విస్తరించి చేయబడింది. పద్మ బ్రాహ్మణ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు మలిపెద్ది కృష్ణశాస్త్రి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనగా కాంతిని ఉపయోగించి బంధించేదే కళ  అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంపీడీవో గుల్లపల్లి విద్యాసాగర్, విశ్రాంత ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ కొండ నరహరి,పద్మ ప్రాహ్మణ సంఘం నాయకులు బింగి రమేష్, బి కే రమేష్, ప్రముఖ సామాజికవేత్త పిట్ట రాజేంద్రప్రసాద్, సంగిశెట్టి రఘుపతి, తవటం కృష్ణ , గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,